‘గాయత్రి’ టైటిల్ లోగోను రిలీజ్ చెయ్యనున్న మోహన్ బాబు !
Published on Nov 21, 2017 5:28 pm IST

మోహ‌న్ బాబుగారు చాలా గ్యాప్ తరువాత ‘గాయత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త‌న సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తీస్తున్నాడు కలెక్షన్ కింగ్. ప్రముఖ దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నవంబర్ 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను ఈ రోజు రాత్రి 10 గంటలకు మోహన్ బాబుగారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేస్తుండడం విశేషం. మలయాళం హీరోయిన్ నిఖిల విమల్ ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తోంది. డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి కథ మాటలు అందించారు.

 
Like us on Facebook