‘అల్లూరు ఊరికి ఏమి చేశావ్ ?’ మంత్రి పై మోహన్ బాబు కామెంట్స్ !

Published on Jan 2, 2022 3:28 pm IST

ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాల కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మోహన్ బాబు, అవంతి శ్రీనివాస్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు మాట్లాడుతూ… ‘రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అవంతి శ్రీనివాస్ గారు, అల్లూరి ఊరికి ఏమి చేశారో చెప్పాలంటూ నవ్వుతూ అడిగారు. అలాగే మోహన్ బాబు మళ్ళీ మాట్లాడుతూ.. ‘అల్లూరు ఊరికి నేను వచ్చి చూస్తాను. అవంతి శ్రీనివాస్ ఏమి చేశాడో చూస్తాను ?’ అంటూ సరదగా కామెంట్స్ చేశారు.

అయితే, మధ్యలో వేదిక పై ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలగజేసుకుని.. ‘మంత్రి అవంతిని వదిలేయండి’ అంటూ అడిగారు. మోహన్ బాబు కూడా నవ్వుతూ ‘కిషన్ రెడ్డి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను’ అంటూ చమత్కరించడంతో అక్కడ వేదికపైన ఉన్నవారు సరదాగా నవ్వుకున్నారు. ఇక మోహన్ బాబు ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘తాను అల్లూరి సీతారామరాజు సినిమాకు కేవలం రూ.300 జీతానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని కూడా మోహన్ బాబు తెలియజేశాడు.

సంబంధిత సమాచారం :