ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ బాబు “సన్‌ ఆఫ్‌ ఇండియా”..!

Published on May 18, 2022 12:23 am IST


సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన ఈ సినిమాకి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించగా, మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 17వ తేది మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా, సర్వేష్‌ మురారి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత సమాచారం :