గాయత్రి విడుదల తేదిని ప్రకటించనున్న మోహన్ బాబు !

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు గాయ‌త్రి మూవీలో న‌టించ‌నున్నాడు. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు. రెండేళ్ల విరామం త‌ర్వాత మోహన్ బాబు ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో విష్ణు, శ్రియ ప్రదాన పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదిని మోహన్ బాబు రేపు ప్రకతిన్చాబోతున్నాడు.

శ్రీ లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై మోహన్ బాబు ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. అనసూయ ఈ సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. మేడ మీద అబ్బాయి సినిమా హీరోయిన్ నిఖిలా విమల్ కీలక పాత్రలో కనిపించబోతోంది. మోహన్ బాబు ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు అందులో ఒకటి హీరో పాత్ర అయితే మరొకటి విలన్ క్యారెక్టర్.