మోహన్ బాబు టాక్ షో.. నిజమేనా ?

Published on Oct 24, 2021 9:30 pm IST

అల్లుఅరవింద్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దూసుకుపోతుంటారు. నిర్మాతగా కొత్త పుంతలు తొక్కుతూనే డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఓటీటీ మాధ్యమంలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఆహా’తో ఓటీటీల్లోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా స్టార్ హీరోలతో కొత్త షోలను స్టార్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఆహాను మరింతగా చేరువ చేస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే కంటెంట్‌ విషయంలో ఆహా మొదటి నుంచి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడు భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం నట సింహం బాలకృష్ణతో భారీ ఓటీటీ టాక్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్‌ అనే టైటిల్ తో ఆహా లో రాబోతున్న ఈ టాక్ షో పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఆహా వారు తాజాగా మరో టాక్‌ షోను కూడా ప్లాన్ చేస్తున్నారని, పైగా ఆ షోలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. ఇప్పటికి అయితే అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :