డ్యూయల్ రోల్ లో కనిపించనున్న మోహన్ బాబు !

24th, December 2017 - 11:38:17 AM

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చేస్తున్న తాజా చిత్రం ‘గాయత్రి’. మొదటి నుండి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా మరొక సంచలన వార్త బయటికొచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మోహన్ బాబుగారు రెండు పాత్రల్లో కనిపించనున్నారట. వాటిలో ఒకటి హీరో పాత్ర కాగా ఇంకొకటి విలన్ పాత్ర కావడం విశేషం.

గతంలో ఈయన ద్విపాత్రాభినయం చేసిన ‘పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, అడవిలో అన్న, ఎం. ధర్మరాజు ఎం.ఏ’ వంటి ఘన విజయాలు సాధించగా ఆయన ‘ఎం. ధర్మరాజు ఎం.ఏ’ తరవాత ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం ఈ ‘గాయత్రి’. డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇందులో మంచి విష్ణు, శ్రియ శరన్, అనసూయలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.