ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని…పవన్ కళ్యాణ్ కి మోహన్ బాబు లేఖ!

ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని…పవన్ కళ్యాణ్ కి మోహన్ బాబు లేఖ!

Published on Sep 26, 2021 4:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక లో చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మోహన్ బాబు ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల కు గానూ, స్పందించడం జరిగింది. ఈ మేరకు డియర్ పవన్ కళ్యాణ్ అంటూ సంబోధిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నా చిరకాల మిత్రుడి సోదరుడు అయిన పవన్ కళ్యాణ్, నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏక వచనం తో సంభోదించాను అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనడం లో తప్పేమీ లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10 వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయ పూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని అంటూ చెప్పుకొచ్చారు.

నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడు అయిన విష్ణు బాబు కు, అతని ప్యానల్ కి వేసి వాళ్ళను గెలిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్, మోహన్ బాబు అంటూ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చాంశనీయం గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు