ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మోహన్ లాల్ “బరోజ్”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మోహన్ లాల్ “బరోజ్”

Published on Jan 22, 2025 8:09 AM IST

మళయాళ సినిమా సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “బరోజ్ 3D” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తన దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే పిల్లలకి నచ్చే విధమైన ఫాంటసీ వండర్ గా వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ చిత్రంను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఒరిజినల్ మళయాళం సహా తెలుగు ఇతర పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. మరి అపుడు మిస్ అయ్యినవారు ఈ సినిమా ఇపుడు చూడాలి అనుకుంటే ఓటీటీలో చూడొచ్చు. మరి కంటెంట్ పరంగా అంత గొప్పగా లేకపోయినా సినిమాలో క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ బలంగా ఉంటాయి.

బరోజ్ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు