మోహన్ లాల్ – డైరెక్టర్ లిజో జోస్ క్రేజీ కాంబినేషన్ లో ‘మలైకొట్టై వలిబన్’

మోహన్ లాల్ – డైరెక్టర్ లిజో జోస్ క్రేజీ కాంబినేషన్ లో ‘మలైకొట్టై వలిబన్’

Published on Dec 25, 2022 12:25 AM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఎంతో సుపరిచితం. అక్కడక్కడా కొన్ని తెలుగు సినిమాల్లో పలు పాత్రల్లో నటించిన మోహన్ లాల్ కు అన్ని భాషల ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక తన కెరీర్ లో పలు విభిన్న పాత్రలతో వైవిధ్యమైన సినిమాలతో ఫ్యాన్స్, ఆడియన్స్ మనసు చూరగొన్న మోహన్ లాల్ కొత్త సినిమా న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా కోసం అందరూ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు, అలానే దీని మీద ఎన్నో అంచనాలున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి రకరకాల వార్తలతో మేకర్స్ ఆసక్తి రేకెత్తించారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా టైటిల్ ను మలైకొట్టై వలిబన్ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) గా అనౌన్స్ చేయడం జరిగింది.

ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయి తన సహజ నటనతో జీవించేయగల టాలెంట్ మోహన్ లాల్ సొంతం. లిజో కూడా విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు, మనిషి మనస్తత్వాలను భిన్నకోణంలో ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న దర్శకుడు. వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిత్రం ఉండబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. జనవరి నుండి షూటింగ్ ప్రారంభం కానున్న సినిమా దాదాపు రాజస్థాన్ లోనే జరుపుకోనుంది. మోహన్ లాల్ రెజ్లర్ గా నటించనున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ మరికొన్ని నెలల అనంతరం ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు