మహేష్ సినిమాలో మోహన్ లాల్ పాత్ర అదే?

మహేష్ సినిమాలో మోహన్ లాల్ పాత్ర అదే?

Published on Feb 15, 2022 11:00 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా మోహన్ లాల్ ది, ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ అట. ఈ సినిమాలో ఆయన సీఎంగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు.

అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు