రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్ ఆఫర్‌కి నో చెప్పిన స్టార్ హీరో..!

Published on Apr 9, 2022 2:00 am IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమా RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌‌‌‌‌‌‌‌కి మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్‌‌‌ని శంకర్ సంప్రదించారట. అవినీతికి పాల్పడే ఓ పెద్ద రాజకీయ నాయకుడిగా ఆ పాత్ర ఉండనుందట. కానీ నెగిటివ్ రోల్ చేయకూడదని ఫిక్స్ అయిన మోహన్‌‌‌‌‌‌లాల్ ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మోహన్‌‌‌‌లాల్ నో అనడంతో మరో నటుడి కోసం శంకర్ వేటలో పడ్డాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :