ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్

Mokshanya 1

నట సింహం బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ మరో మారు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. తాను ఇప్పట్లో సినిమాలోకి వచ్చేది లేదన్నట్లు గా వారికి హింట్స్ ఇస్తున్నారు. తాజాగా బయటికొచ్చిన ఓ ఫొటో చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. ఎప్పటినుండో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇటీవల గుంటూరు వేదికగా మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలు వారు ఘనంగా నిర్వహించారు. కానీ మోక్షజ్ఞకు మాత్రం అసలు సినిమాలలోకి రావాలనే ఆసక్తే లేదని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన తన శరీరం పై ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదని అర్థం అవుతుంది.

తాజాగా కుటుంబ సభ్యులతో మోక్షజ్ఞ ఇంటిలో ఉన్న ఒక ఫోటో బయటికి రాగా, అందులో ఆయన లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉంది. ఆ ఫోటో చూసిన ఎవరికైనా మోక్షజ్ఞకు సినిమాలలోకి రావడం ఇష్టం లేదనే విషయం ఇట్టే అర్థం అవుతుంది. ఇప్పటికే మోక్షజ్ఞకు 25ఏళ్ళు వచ్చినట్టు సమాచారం. మరి ఇంకెప్పుడు ఆయన సినిమాలలోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.

Exit mobile version