హీరో బాలక్రిష్ణ కాదు.. మోక్షజ్ఞ !
Published on Oct 25, 2017 10:15 am IST

నందమూరి బాలక్రిష్ణ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఎన్నాళ్ళ నుండో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలనే ప్లాన్స్ కూడా నడుస్తున్నాయి. 369 ను డైరెక్ట్ చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుగారు ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సీక్వెల్ లో ఇన్నాళ్లు బాలక్రిష్ణ మెయిన్ లీడ్ చేస్తారని, ఆయన వారసుడు మోక్షజ్ఞ ఈ సినిమాతోనే తెరగేంట్రం చేస్తారని వారట్లు వచ్చాయి.

కానీ అసలు విషయం అది కాదని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగీతం తెలిపారు. ఆదిత్య 369 కు సీక్వెల్ తీయాలనుకుంటున్న మాట వాస్తవమేనని, అయితే అందులో బాలక్రిష్ణ ఒక కీలక పాతర చేస్తారని, కథలో ప్రధాన పాత్రను ఆయన తనయుడు మోక్షజ్ఞ చేత చేయించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయమై బాలక్రిష్ణ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాని కూడా అన్నారు. మరి మోక్షజ్ఞ తెరగేట్రంతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 
Like us on Facebook