వర్కవుట్స్ మొదలుపెట్టిన మోక్షజ్ఞ !
Published on Jun 20, 2017 1:34 pm IST


నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంశం ‘మోక్షజ్ఞ’ తెరంగేట్రం. గత రెండు సంవత్సరాలుగా దీనిపై రకరకాల తర్జన భర్జనలు జరుగుతున్నా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీ కథనం ప్రకారం మోక్షజ్ఞ 2018లో ఖచ్చితంగా సినిమా చేస్తాడని తెలుస్తోంది. అందుకోసం కావలసిన గ్రౌండ్ వర్కును కూడా మొదలుపెట్టాడట మోక్షజ్ఞ.

వాటిలో భాగంగా నటనలో శిక్షణ తీసుకుంటూనే మంచి ఫిట్నెస్ కోసం బాడీ వర్కవుట్స్ కూడా చేస్తున్నాడట. ఇకపొతే బాలకృష్ణ మాత్రం సినిమా గురించి హైప్ పెంచి మోక్షజ్ఞ పై ఒత్తిడి క్రియేట్ కాకుండా ఉండేందుకు ఎలాంటి హడావుడి లేకుండా సినిమాను చేయాలని చూస్తున్నారట. అందుకే సినిమాకు సంబందించిన పనులన్నింటినీ నిదానంగా, కాస్త గోప్యంగానే చేస్తున్నారు. ఇకపోతే సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడెవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

 
Like us on Facebook