ఈ నెల 17న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోన్న “మొన‌గాడు”..!

ఈ నెల 17న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోన్న “మొన‌గాడు”..!

Published on Jun 11, 2022 7:00 PM IST

కీలుగుర్రం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్, ఛ‌త్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం “మొనగాడు”. వంశీ ఆకుల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ ల‌వ్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా మొన‌గాడు చిత్రాన్ని తెర‌కెక్కించామని అన్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న మా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో దేవ్ గిల్‌, ఛ‌త్ర‌ప‌తి పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాట‌లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు