లేటెస్ట్..తిరుపతిలో “ఆదిపురుష్” ఈవెంట్ వేదిక ఎక్కడంటే.!

Published on Jun 3, 2023 12:00 pm IST

ఇప్పుడు సోషల్ మీడియా సహా ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా ప్రతీ రోజు ట్రెండ్ అవుతున్న సినిమా పేరు “ఆదిపురుష్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రెండు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు వచ్చినప్పటికీ ఈ సినిమాకి 1000 కోట్ల గ్రాస్ పొటెన్షియల్ అయితే నెలకొంది. ఇక ఈ రిలీజ్ కి గ్యాప్ లో అయితే ఈ జూన్ 6న మేకర్స్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ లో అయితే నెవర్ బిఫోర్ ప్లాన్ లు చేస్తుండగా మేకర్స్ ఈ ఈవెంట్ ని తిరుపతిలో చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ లో అసలు తిరుపతిలో ఎక్కడ ఈ ఈవెంట్ జరుగుతుందో అభిమానులు ఎక్కడికి రావచ్చు అనేది క్లారిటీ ఇచ్చారు.

ఈ ఈవెంట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో అయితే నిర్వహిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఆరోజున అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతున్నట్టుగా మేకర్స్ తెలిపారు. సో డార్లింగ్స్ రెబల్స్ అంతా అక్కడికి వెళ్లి ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ని విట్నెస్ చెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :