తారక్ నెక్స్ట్ స్టార్టింగ్ పై మరింత క్లారిటీ.!

Published on May 15, 2022 8:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. RRR లాంటి భారీ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో తారా స్థాయి హైప్ ఇప్పుడు ఈ సినిమాపై అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై గత కొన్నాళ్ల నుంచి ఏదొక బజ్ వినిపిస్తూ వస్తూనే ఉంది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానిపై మాత్రం గట్టి క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమా ఎలాంటి డిలే లేకుండా ఈ జూలై లోనే స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది. అయితే హీరోయిన్ ఎవరు అనే దానిపై మాత్రం అందరికీ క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుండగా కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :