“పుష్ప” నుంచి క్రేజీ అనౌన్స్మెంట్స్ రెడీ.!

Published on Dec 8, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో మంచి ఇంపాక్ట్ తో ఉంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క మేకర్స్ ఎప్పటికపుడు సాలిడ్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే మొన్న ట్రైలర్ ని రిలీజ్ చెయ్యగా ఇప్పుడు రానున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రేజీ అనౌన్స్మెంట్స్ కోసం క్లారిటీ ఇచ్చారు. రానున్న రోజుల్లో పుష్ప నుంచి నెక్స్ట్ అవైటెడ్ సాంగ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ల అప్డేట్స్ ని రివీల్ చేయనున్నారట. ఇక వీటి డేట్స్ ఎప్పుడో అనేది చూడాలి. మరి ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :