రవితేజ రాకతో “వాల్తేరు వీరయ్య” పై మరిన్ని అంచనాలు.!

రవితేజ రాకతో “వాల్తేరు వీరయ్య” పై మరిన్ని అంచనాలు.!

Published on Dec 13, 2022 8:02 PM IST


వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రానున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మల్టీ స్టారర్ చిత్రం కూడా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అలాగే మరో మాస్ హీరో రవితేజ కూడా కీలక పాత్రలో నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. మరి ఈ చిత్రంపై ఆల్రెడీ మంచి అంచనాలు నెలకొనగా నిన్ననే మేకర్స్ అయితే ఈ సినిమాలో రవితేజ పాత్రకి సంబంధించి ఓ మాస్ అండ్ పవర్ ఫుల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ గ్లింప్స్ చూసాక అయితే మరిన్ని అంచనాలు దీనిపై నెలకొన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఆల్రెడీ మాస్ లో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నిన్న టీజర్ తో అయితే మరో లెవెల్ కి వెళ్ళింది. దీనితో ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసే ఛాన్స్ ఆడియెన్స్ కి వచ్చింది అని చెప్పి తీరాలి. మరి దర్శకుడు బాబీ అయితే ఇద్దరు స్టార్స్ ని ఎలా చూపించనున్నాడో అనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు