ఫస్ట్ లుక్ తర్వాత “టైగర్ నాగేశ్వరరావు” పై మరింత హైప్.!

Published on May 25, 2023 8:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ ముందు నుంచి కూడా గట్టి కాన్ఫిడెన్స్ తో ఉండగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి అయితే అదిరే ప్లానింగ్స్ కూడా చేసారు. ఇక నిన్న రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రో గ్లింప్స్ కి అయితే ఫ్యాన్స్ సహా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

దీనితో అయితే డెఫినెట్ గా టైగర్ నాగేశ్వరరావు పై హైప్ ఫస్ట్ లుక్ తర్వాత మరింత పెరిగింది అని చెప్పొచ్చు. అంతే కాకుండా నార్త్ మార్కెట్ లో కూడా రవితేజ నుంచి సాలిడ్ నంబర్స్ కూడా ఈసారి నమోదు అయ్యేలా ఉన్నాయని కూడా అనిపిస్తుంది. మరి ఈ అవైటెడ్ సినిమా అయితే రవితేజ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చే సినిమాగా మారుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :