గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు అంటూ వచ్చిన టాక్ లో ఓ చిన్న ఎలెక్ట్రిక్ షాక్ అన్నట్టుగా సినిమా ఓ సాంగ్ లీక్ అవ్వడం అందరిలో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది.
దీనితో ఈ సాంగ్ వెంటనే వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సినిమా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సాంగ్ పై అయితే మరింత సమాచారం తెలుస్తుంది. లీక్ అయ్యిన సింగ్ అయితే ఫైనల్ వెర్షన్ ఏమాత్రం కాదట. టెస్టింగ్ సాంగ్ మాత్రమే అని మెయిన్ సాంగ్ ని స్టార్ సింగర్స్ తో పాడించడం ఫైనల్ మిక్స్ ఇంకా చాలా పనులు ఉన్నాయట.
అయితే ఈ లీక్ విషయంలో మేకర్స్ తగిన యాక్షన్ తీసుకోనున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఎలాంటి వెర్షన్ అయినప్పటికీ సాంగ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం అర్ధం అయ్యిపోయింది. దీనితో ఆల్రెడీ ఈ సాంగ్ అన్ అఫీషియల్ చార్ట్ బస్టర్ అయ్యింది.