మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాంచ్ పై మరింత సమాచారం.!

Published on Feb 3, 2022 1:15 pm IST


ప్రస్తుతం సూపర్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ పెట్లతో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత మహేష్ లైనప్ కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి. నిజానికి అయితే సర్కారు వారి పాట నుంచే మార్చారని చెప్పాలి.

మరి ఈరోజు తన లైనప్ లోని తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా ఈరోజు హైదరాబాద్ రామనాయకుడు స్టూడియో లో పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దీనిపై మరింత సమాచారం బయటకి వచ్చింది. ఈ చిత్రం ఈ మొదటి రోజున పూజా హెగ్డే పై షాట్ తో షూట్ ని స్టార్ట్ చెయ్యగా మహేష్ సతీమణి నమ్రత ఫస్ట్ షాట్ కి క్లాప్ ని చెప్పారు.

అలాగే పారిశ్రమిక వేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరి అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ముందు రోజుల్లో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ లు ఎస్ రాధాకృష్ణ తెలియజేసారు. సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :