“RRR” టీజర్ పై మరింత ఇంట్రెస్టింగ్ బజ్.!

“RRR” టీజర్ పై మరింత ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Oct 27, 2021 4:00 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ సహా మొత్తం పాన్ ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ “RRR” టీజర్. కేజీయఫ్ 2 అయ్యింది మొన్న రాధే శ్యామ్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఈ భారీ సినిమా వంతు వచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికతో ఇండియన్ టాప్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ థ్రిల్లర్ నుంచి టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ అప్డేట్ ఏమో కానీ ఈ క్రమంలో దీనిపై మరింత ఇంట్రెస్టింగ్ బజ్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ టీజర్ ని కేజీయఫ్ 2, రాధే శ్యామ్ లానే సింగిల్ టీజర్ గా రిలీజ్ చేస్తారని టాక్ ఉండగా అసలు ఈ టీజర్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తికర ఊహాగానాలే వినిపిస్తున్నాయి. ఈ టీజర్ ఎన్టీఆర్, చరణ్ లపై కలిపి ఉండగా ఒక్క డైలాగ్ కూడా ఇందులో ఉండదని టాక్.

కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు నెవర్ బిఫోర్ యాక్షన్ విజువల్స్ ని ఒక నిమిషం నిడివి లోపు రాజమౌళి చూపించబోతున్నట్టు వినికిడి. ఇక ఇందులో ఎంతమేర నిజం ఉందో కానీ టీజర్ పై అంచనాలు మాత్రం ప్రతీ ఒక్కరికీ పీక్స్ లో ఉన్నాయి. మరి ఈ వినిపిస్తున్న బజ్ అంతా టాక్ లానే మిగిలిపోతుందా లేక రాజమౌళి అందరి ఊహలకు అందనిది ఏదో ప్లాన్ చేసారా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు