“గాడ్ ఫాథర్” కాంబినేషన్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత చిరు మరోసారి “గాడ్ ఫాదర్” దర్శకుడు మోహన్ రాజా తో కలిసి వర్క్ చేయనున్నారు అని ఇంట్రెస్టింగ్ బజ్ రీసెంట్ గానే మొదలైంది. ఇక ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. అలాగే ఈ రానున్న జూన్ మొదటి వారంలోనే సినిమాపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అందిస్తారని వినిపిస్తోంది. అంతే కాకుండా సినిమా రెగ్యులర్ షూట్ ఈ ఆగస్ట్ నుంచే మొదలు కానున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే పక్కా ప్లానింగ్ ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ వెళుతుంది అని చెప్పాలి. ఇక ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

Exit mobile version