షారుఖ్, అట్లీ ల ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Sep 20, 2021 1:15 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు అట్లీ ల కాంబోలో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్టార్ట్ అయ్యిన ఈ బిగ్ ప్రాజెక్ట్ పై మరింత ఇన్ఫో ఉన్న కొద్దీ అలా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా ఒక సాలిడ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతుంది అని అలాగే ‘లయన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసారని కూడా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే తాజా టాక్ ప్రకారం అయితే ఈ సినిమాలో రివెంజ్ తో పాటుగా మంచి రాబరీ సీన్స్ కూడా ఉంటాయట. మరి ఇది వరకే షారుఖ్ “హ్యాపీ న్యూ ఇయర్” అనే సినిమాని ఇదే కాన్సెప్ట్ తోనే తీశారు. రివెంజ్ మరియు దొంగతనం అందులో కనిపిస్తుంది. మరి అట్లీ ఎలాంటి కథను డిజైన్ చేసాడో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తాడని టాక్ ఉండగా నయన్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :