“పుష్ప” సినిమాపై మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.!

Published on Sep 15, 2021 8:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ “పుష్ప” అనే సాలిడ్ రా ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం చివరి దశ షూట్ లో ఉంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా దీనిపై మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి. తాజాగా రష్మికా మందన్నా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా ఇవి తెలిసాయి.

అల్లు అర్జున్, ఫహద్ లు తమ కళ్ళతోనే బెస్ట్ ఇవ్వగలగడం నేను గమనించానని అలాగే ఈ సినిమా అంతా కూడా దాదాపు నిజమైన లొకేషన్స్ లోనే షూట్ చెయ్యబడింది అని తెలిపింది. అడవిలో ఫైట్స్ కానీ ఇంకా డాన్సులు కానీ ఇవన్నీ రియల్ గా ఉన్నవే అని అంతే కాకుండా సినిమా అంతా కూడా దాదాపు 70 శాతంకి పైగా నిజ జీవిత ప్రాంతాల్లోనే తెరకెక్కించబడింది అని రష్మికా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ సినిమాపై తెలిపింది.

సంబంధిత సమాచారం :