నాని “దసరా” సెకండ్ సింగిల్ పై సర్వత్రా ఆసక్తి!

Published on Feb 11, 2023 1:11 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. మార్చ్ 30 వ తేదీన ఈ చిత్రం ను వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, ఫస్ట్ సింగిల్ కి, టీజర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన సెకండ్ సింగిల్ పై మేకర్స్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సెకండ్ సింగిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హార్ట్ బ్రేక్ అంతెం అంటూ మేకర్స్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. రిలీజైన మరొక పోస్టర్ మరింత ఆసక్తి నీ రేకెత్తిస్తుంది. ఓరి వారి తో ఈ సెకండ్ సింగిల్ ఉండనుంది. ఈ పాటను ఫిబ్రవరి 13 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. వాలెంటన్స్ డే సందర్భంగా ఈ పాట ప్రేక్షకులను అలరించనుంది. ఈ రా విలేజ్ డ్రామా కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :