మహేష్ నెక్స్ట్ పై ఇంకా కొనసాగుతున్న మిస్టరీ.!

Mahesh

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మొత్తం మూడు సాలిడ్ హిట్స్ తర్వాత తన హ్యాట్రిక్ పరంపరను కొనసాగిచాలని స్టార్ట్ చేసిన మరో మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ను లైన్ లో పెట్టారు. వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇది అయ్యాక రాజమౌళితో ఓ భారీ చిత్రం ఉంది.

కానీ అది స్టార్ట్ అయ్యేలోపు మహేష్ మరో సినిమా చెయ్యనున్నారు. కానీ అది ఏంటా అన్నది మాత్రం మంచి మిస్టరీగా మారిపోయింది. ఇప్పటికే పలువు స్టార్ దర్శకుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్, వంశీల పేర్లు గట్టిగా వినిపించగా త్రివిక్రమ్ తో అయితే మహేషే కన్ఫర్మ్ చేశారు. కానీ అది ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో కన్ఫర్మ్ లేదు.

ఇక మహేష్ నెక్స్ట్ పై మాత్రం అలా బజ్ వినిపిస్తూనే ఉంది. లేటెస్ట్ టాక్ ప్రకారం మళ్ళీ కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ పేరు రేస్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. “ఖైదీ”, “మాస్టర్” చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసిన ఈ దర్శకుడు తెలుగులో కూడా చేస్తున్నాడని టాక్ వచ్చింది. మరి ఈ సాలిడ్ కాంబో సెట్టయ్యిందో లేదో కాలమే డిసైడ్ చెయ్యాలి.

Exit mobile version