‘భీమ్లా’ సాంగ్ ఒరిజినల్ ఫ్లేవర్ కే ఎక్కువ ఓట్లు!

Published on Sep 4, 2021 11:30 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం భీమ్లా నాయక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ తో ఈ మధ్య హోరెత్తిస్తుండగా మొన్న పవన్ బర్త్ డే కానుకగా వచ్చిన ఫస్ట్ సింగిల్ భీమ్లా టైటిల్ ట్రాక్ భారీ రెస్పాన్స్ ని కూడా అందుకుంది. అయితే ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా హై అంచనాలు పెట్టుకున్న వారిని ఫస్ట్ లో డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి.

పక్కా మాస్ గా ఫాస్ట్ బీట్ లో ఉంటుంది అనుకుంటే స్లో గా కొత్తగా ఇది ఉంది. కానీ దానిని ఫాస్ట్ గా సెట్ చేసి కనుక వింటే బాగుంది అని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు. కానీ మెల్లమెల్లగా మాత్రం ఈ సాంగ్ ఒరిజినల్ ఫ్లేవర్ ని ఇష్టపడే వారు ఎక్కువ అవుతున్నారు. అంతే కాకుండా స్లో పాయిజన్ లా ఈ సాంగ్ హమ్మింగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మరి లేటెస్ట్ గానే 10 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న ఈ సాంగ్ ఇంకా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

సంబంధిత సమాచారం :