తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సార్”. తమిళ్ మరియు తెలుగులో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి తీసాడు. మరి ఈ సినిమాతోనే ధనుష్ తెలుగు సినిమాకి అలాగే వెంకీ తమిళ్ సినిమాకి ఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమాపై తెలుగు మరియు తమిళ్ లో సాలిడ్ బజ్ అయితే నెలకొంది. మరి మేకర్స్ ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఒకరోజు ముందే సినిమాకి ప్రీమియర్స్ వేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ నుంచి వస్తుందని ఆశించారు.
మరి ఈ సినిమా కి మొదట హైదరాబాద్ లో సింగిల్ షో కి ప్లాన్ చేయగా దీనికి సాలిడ్ రెస్పాన్స్ రావడం తర్వాత దానికి 3 షోస్ కి పెంచడం అవి కూడా ఫుల్ అయిపోవడం జరిగింది. దీనితో ఈ ఒక్క స్పెషల్ షో కాస్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాల్లో పడబోతున్నాయి. ఇక హైదరాబాద్ సహా వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మరియు రాజమండ్రి కాకినాడ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడనున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఈ సినిమాతో ధనుష్ కి టాలీవుడ్ ఎంట్రీ అదిరేలా ఉందని చెప్పాలి.