లేటెస్ట్..”రాధే శ్యామ్” 5వ షోకి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

Published on Mar 10, 2022 3:20 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ చిత్రం మరికొన్ని గంటల్లో బిగ్ స్క్రీన్స్ పై స్క్రీనింగ్ కి రానుంది.

మరి చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అత్యంత గ్రాండ్ గా ఈ సినిమా తాలూకా రిలీజ్ ఉండనుంది. మరి దీనికి గాను కొన్ని స్పెషల్ పర్మిషన్స్ మరియు హైక్ లు సహా అదనపు షోలు వేయడానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు రాధే శ్యామ్ సినిమాకి గాను 5 షోలు ప్రదర్శితం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు జాము 1 గంట వరకు సినిమా ప్రదర్శించుకోవచ్చు అని తెలియజేసారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :