నాని “దసరా” కి మరిన్ని భారీ ఆఫర్స్.?

Published on Feb 3, 2023 12:09 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ నాటు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “దసరా” కోసం తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ తోనే నెక్స్ట్ లెవెల్ హైప్ ని రేపింది. నాచురల్ స్టార్ నాని ని పక్కా మాస్ రోల్ లో చూపించడం ఆడియెన్స్ కి అమితంగా ఇంప్రెస్ చేయగా సినిమాని మరింత హైప్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా కి ఇప్పుడు ముందు కన్నా మరిన్ని బెటర్ అండ్ భారీ ఆఫర్స్ మొదలయ్యాయని తెలుస్తుంది.

మరి దీనికి కారణం సినిమా టీజర్ అన్నట్టే తెలుస్తుంది. అయితే ఆల్రెడీ పలు చోట్ల థియేట్రికల్ డీల్ కంప్లీట్ అయిపోగా మిగతా వాటికీ భారీ డిమాండ్ ఈ సినిమాకి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ మార్చ్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :