“సలార్” మాస్ ట్రీట్ పై పెరుగుతున్న సస్పెన్స్.!

Published on May 23, 2022 7:01 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న క్రేజీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై మళ్ళీ రీసెంట్ గా ఓ రేంజ్ లో హైప్ స్టార్ట్ అవ్వగా ఆ మధ్య నీల్ తెరకెక్కించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ తో సలార్ నుంచి ఒక మాస్ ట్రీట్ గా ఈ మే నెల లోనే సాలిడ్ గ్లింప్స్ గాని టీజర్ గాని రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ మే కావస్తుండడంతో ఇప్పుడు ఈ సినిమా మాస్ ట్రీట్ పై అందరిలో మరింత సస్పెన్స్ నెలకొనడంతో పాటుగా అభిమానుల్లో కూడా కొద్దిగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరి ఈ నెలలోనే ఈ మాసివ్ అనౌన్సమెంట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :