ఆ సినిమా ఉత్ఖంట భరితంగా ఉండబోతోంది !

‘రామాయణంలోనే రాముడికి రావణాసురుడికి గొడవ.. మాహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ.. వాళ్లు వాళ్లు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోతే బాగుండేది. కాని వాళ్ల మూలంగా జరిగిన ఆ యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే’.. అంటూ మోహన్ బాబు గాయత్రి టిజర్ లో చెప్పిన డైలాగ్ కు మంచి స్పందన లభించిది. మోహన్ బాబు చేసిన రెండు విభిన్న పాత్రలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.

మదన్ దర్శకత్వం వహించిన గాయత్రి సినిమాకు డైమండ్రత్నబాబు కథ మాటలు అందించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో విష్ణు, శ్రియ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తరువాత ఏం జరగబోతోందోననే ఉత్ఖంట భరితంగా ఈ సినిమా ఉండబోతోంది. ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గాయత్రి.