“ఆచార్య” గ్గెస్టులపై సర్వత్రా ఆసక్తి.!

Published on Apr 23, 2022 9:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఈరోజు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దీనికి గాను సినిమా మెయిన్ క్యాస్ట్ ఒక్క కాజల్ మినహా అంతా హాజరు కానుండగా వారితో పాటు సినిమాకి వచ్చే ప్రత్యేక అతిథులకు సంబంధించి మంచి సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే చాలా మంది హీరోలు, దర్శకులు పేర్లు వినిపించాయి. అలాగే మరింత మంది హీరోలు కూడా హాజరు అవుతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి వీటన్నిటిలో ఏది నిజం అవుతుందో అని అభిమానుల్లో అయితే మంచి ఆసక్తి నెలకొంది. మరి వేచి చూడాలి ఎవరు వస్తారో అనేది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించగా చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :