హీరోకి ఆ కేసులో మరిన్ని చిక్కులు !
Published on Jul 15, 2017 5:31 pm IST


మలయాళీ స్టార్ హీరో దిలీప్ కు నటి కిడ్నాప్ కేసుకు సంబందించిన చిక్కులు ఎక్కువవుతున్నాయి. హీరోయిన్ కిడ్నాప్ చేసి లైంగికంగా దాడి చేసిన ఘటనలో దిలీప్ హస్తం ఉండనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిలీప్ ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ రోజు పోలీస్ లు దిలీప్ ని కోర్టులో హాజరు పరిచారు. తనకు బెయిల్ మంజూరు చేయాలనే దిలీప్ విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

దీనితో దిలీప్ పోలీస్ ల కస్టడీలోనే మరికొన్ని రోజుపాటు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో ఈ కేసు సంచలనంగా మారింది. దిలీప్ కు నటి కిడ్నాప్ విషయంలో ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయని పోలీస్ ల ప్రాధమిక విచారణలో తేలింది. దీనిపై కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనే అంశం ఆసక్తిగా మారింది.

 
Like us on Facebook