ధనుష్ ‘సార్’ నుండి మోస్ట్ అవైటెడ్ వీడియో సాంగ్ రిలీజ్

Published on Mar 14, 2023 11:17 pm IST


ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ సార్. ఈ మూవీని తెలుగు, తమిళ ద్విభాషా మూవీగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకరా స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపించిన ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ధనుష్ ఫ్యాన్స్ ని కూడా అలరించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని ఎంతో క్రేజ్ అందుకున్నాయి. ముఖ్యంగా శ్వేతా మోహన్ అద్భుతంగా పాడిన ఇందులోని మాస్టారు మాస్టారు సాంగ్ అయితే ఎంతో గొప్ప పాపులర్ అయింది. కాగా నేడు ఈ సాంగ్ యొక్క ఫుల్ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. తమ సినిమాని ఇంతగా ఆదరించడంతో పాటు ఈ మూవీ ద్వారా తొలిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ కి కూడా మంచి సక్సెస్ అందించినందుకు సార్ యూనిట్, ప్రత్యేకంగా ప్రేక్షకాభిమానులకి కృతజ్ఞతలు తెలుపుతోంది.

సంబంధిత సమాచారం :