
త్రిషతో కలసి నటించడం చాలా కంఫర్టబుల్ అంటున్నాడు తమిళ హీరో శింబు. ఇతర హీరోలు ఎవరైనా ఈ స్టేట్మెంట్ ఇస్తే మీడియా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు. నయనతార, హన్సికలతో ఘాటు ప్రేమాయణం సాగించిన శింబు ఈ మాట అనేసరికి చెన్నై మీడియా త్రిష, శింబుల మధ్య ఏమైనా జరుగుతుందా..? అంటూ గాసిప్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
ప్రముఖ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… మీకు ఏ హీరోయిన్ తో కలసి నటించడం ఇష్టం అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. త్రిషతో నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్బుతంగా కుదిరింది. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా. అంటూ సమాధానం ఇచ్చాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు, త్రిష నటించిన విన్నైతాండి వరువాయ(ఏం మాయ చేశావే తమిళ వెర్షన్) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.