వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్!

Published on Jan 3, 2022 7:02 pm IST

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. డిజిటల్ ప్రీమియర్ గా కూడా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ప్రసారం కానుంది. థియేటర్ల లో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి. బన్నీ వాసు మరియు వాసు వర్మ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :