మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Published on Nov 7, 2021 1:28 am IST


అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని దసరా విజేతగా నిలవడమే కాకుండా సాలీడ్ కలెక్షన్లను కూడా రాబట్టింది.

అయితే ఈ సినిమాకు రూ.20.91 కోట్ల బిజినెస్ జరిగింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.17.23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దీంతో బయ్యర్లకు 3 కోట్లకు పైగా లాభాలు వచ్చి పడ్డాయి.

క్లోజింగ్ కలెక్షన్ రిపోర్ట్స్

నైజాం – 7.59 కోట్లు
సీడెడ్ – 4.08 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.44 కోట్లు
ఈస్ట్ – 1.25 కోట్లు
వెస్ట్ – 1.04 కోట్లు
గుంటూరు – 1.43 కోట్లు
కృష్ణా – 1.19 కోట్లు
నెల్లూరు – 0.87 కోట్లు

ఏపీ + తెలంగాణ – 19.85 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ – 3.94 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ – 23.77 కోట్లు షేర్

సంబంధిత సమాచారం :