ఇంటర్వ్యూ: తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే – బొమ్మరిల్లు భాస్కర్

ఇంటర్వ్యూ: తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే – బొమ్మరిల్లు భాస్కర్

Published on Oct 16, 2021 8:59 PM IST

అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. 2006లో బొమ్మరిల్లుతో మొదలుపెట్టి పరుగు, ఆరెంజ్, ఒంగోలుగిత్త వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు తీసి ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుని మళ్ళీ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” సినిమాతో మన ముందుకు వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ మీడియాతో ముచ్చటించారు.

“బొమ్మరిల్లు” నుండి సాగుతున్న ఈ జర్నీలో నా లైఫ్ ని అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఎక్కడో ఫీల్ అయిన విషయాలను కథగా రాసుకొని స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలన్నదే నా ప్రయత్నం. నా ప్రతి సినిమాలో అది చేసుకుంటూ వచ్చాను. ప్రతి సినిమాను నేను అనలైజ్ చేసుకుంటూ కథగా రాసేటప్పుడు నా లైఫ్ లో నేను చేసిన తప్పుల్ని తెలుసుకుంటూ నా లైఫ్ తో పాటు అందరి లైఫ్స్ బెటర్మెంట్స్ ఆవ్వాలని కొత్త ఆలోచనలతో కథను తయారు చేసుకొంటూ వచ్చాను. లైఫ్ లో అందరూ హ్యాపీగా ఇంటెన్స్ గా బతకాలి అనేదే నా కోరిక. “బొమ్మరిల్లు” సినిమాలో ఫాదర్ & సన్ ఎమోషన్ చూపించారు. మీ ఫాదర్ అలాగే ఉండేవారా అని అడిగే వారని, కానీ మా ఫాదర్ స్కూల్ హెడ్మాస్టర్ ఆయన చాలా ఫ్రీడం ఇచ్చేవారని అన్నారు.

నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఎక్కువగా పెరిగాను. రియల్ ఇన్సిడెంట్స్ ను బొమ్మరిల్లు సినిమాలో తీసుకోవడం జరిగింది. అలాగే నా లైఫ్ స్టైల్ లో జరిగినవి. ఆఫీసుకెళ్ళి పని చెయ్యమని చెప్పినపుడు జరిగినవి కావచ్చు. స్పెషల్‌గా నేను వారి ఇంట్లో క్యారం బోర్డు ఆడే టప్పుడు స్ట్రైకర్ నా చేతిలో ఉన్నప్పుడు నాకు ఎలా కొట్టాలో తెలుసు. కానీ నా స్ట్రైకర్ దగ్గర వేరే వ్యక్తి చెయ్యిపెట్టి ఇలా ఆడు, ఆలా ఆడకు అని చెపితే నాకు నచ్చేది కాదు. వారి ప్రేమ నాకు అర్థమైన కానీ మనకు ఫ్రీడమ్ ఒకటి ఉంటుంది కదా మనకు నచ్చింది చేయాలనేది నా కోరిక.

ఈ పదిహేను సంవత్సరాల్లో నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాను, ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ఆలోచించదానికే నాకు ఎక్కువ టైం పట్టేదని, ఒంగోలు గిత్త తర్వాత రాజుగారు, పి.వి.పి గార్లతో బెంగళూర్‌లో తమిళ్, తెలుగులో మల్టిస్టారర్స్ సినిమా స్టార్ట్ చేద్దమని అనుకున్నాం. అయితే ఇందులో రెండు భాషల్లోనూ ముగ్గురు పెద్ద హీరోలు, నలుగురు పెద్ద హీరోయిన్స్ ఇంత పెద్ద కాస్టింగ్‌తో అనుకున్నప్పుడు వారి డేట్స్ కుదరక క్యాస్టింగ్ కోసమే సంవత్సరం పైనే టైం అయ్యింది. దాంతో ప్రొడ్యూసర్‌కు చాలా టైం వేస్ట్ అవుతుందని తమిళ్ లో సినిమా చేయడం జరిగింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తీసుకుంటే మ్యారేజ్ అన్న దాంట్లో మనకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి, పెళ్లి అనేది ఫుల్ హ్యాపీగా జరిగినా కూడా ప్రతి పెళ్లిలో ఫుల్ సెలబ్రేషన్స్ కనిపిస్తాయి తర్వాత వచ్చే దాంట్లో ఎలా బ్రతకాలో అనే క్లారిటీ ఉండదు. దీంట్లో ఉన్న డైనమిక్ ఏంటో అనేది మనకు తెలియదు. దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో చెప్పాలి కాబట్టి నాకున్న లిమిటేషన్స్ తో, నాకున్న ఫ్రీడంలో ఫన్నీ లేయర్‌తో చెప్పాలి కాబట్టి ఈ సినిమాను లైట్ హార్టెడ్‌గా ఎంజాయ్ చేయాలని తీశాము.

ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన జంటను లైఫ్ లాంగ్ హ్యాపీగా పక్కన ఉండాలని చెపుతారు. కానీ లైఫ్ లాంగ్ పక్కన ఉండడం వేరు దగ్గర ఉండడం వేరు. పక్కన ఉండడానికి అన్ని అర్హతలు సంపాదిస్తాం కానీ దగ్గర ఉండడానికి ఏం కావలన్నదు ఇందులో చూపించాము. మనం పిల్లలకి చిన్నప్పటి నుండి ఎమోషన్స్ అర్థం అయ్యేలా నేర్పించి ఉంటే అది వస్తువులతో కానివ్వండి, మనసులతో కానివ్వండి ఇంకో లెవెల్లో మన లైఫ్ బెటర్‌గా ఉండేది. క్లైమాక్స్ లో హీరోయిన్ అంటుంది, ఎమోషనల్ అవసరాలను తీర్చుకోవడానికి, షేర్ చేసుకోవడానికి మాకంటూ ఒకడు ఉండాలి అందుకే పెళ్లి చేస్తారేమో అనే డైలాగ్ ఇందులో ఉంది.

నాకు టెక్నికల్‌గా రైటర్‌గా బొమ్మరిల్లు నాకు శక్తి నిచ్చింది. సురేష్ గారు ఫిలిం స్కూల్‌కి వెళ్లేటప్పుడు బొమ్మరిల్లు లాంటి స్క్రీన్ ప్లే రాయాలని స్టూడెంట్స్ కు చెపుతున్నాను అనేవారు. అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. నేను కూడా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుని వచ్చినవాన్నే ఎడిటర్ మోహన్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.

మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను నా సినిమాలో మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను నాకు సిచ్చువేషన్ కరెక్ట్ గా ఉన్న సాంగ్స్‌ని సెలెక్ట్ చేసుకొంటాను చూసిన ఐదు నిమిషాలు కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యాలని చూస్తాను.

ఈ సినిమా చూసిన యూత్ అందరూ కూడా ఫోన్స్ చేసి చాలా బాగా తీసావ్, కపుల్స్ కూడా వారిలో ఏం లోపం ఉందని ఆలోచించుకునే టాపిక్ చెప్పావు అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి అరవింద్ గారు, వాసు వర్మ, బన్ని వాసు గారు నిజంగా హెల్ప్ చేశారు. చిన్న లైను ఎమోషన్ గా చెప్పడం నాకిష్టం, డ్రైగా చెప్పడం ఇష్టం ఉండదు. అలా ట్రై చేసినందుకు అందరూ బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. అవి ఏంటి ఎవరితో చేస్తాను అనే విషయాలు త్వరలో తెలియజేస్తానని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు