మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Nov 14, 2021 8:02 pm IST


అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి గోపి సుందర్ అందించిన సంగీతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయింది.

ఈ చిత్రం థియేటర్ల లో సూపర్ హిట్ సాధించినట్లు గానే డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యి ఆహా వీడియో లో సూపర్ హిట్ సాధించేందుకు సిద్దం అయింది. ఈ చిత్రం ఈ నెల 19 వ తేదీన ఆహా వీడియో లో ప్రసారం కానుంది. అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే ల నటన తో ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళింది అని చెప్పాలి. ఆహా వీడియో లోకి ఈ చిత్రం వస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :