“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” రిలీజ్ డేట్ మార్చుకోనుందా?

Published on Sep 26, 2021 2:12 am IST


అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను కూడా వదిలారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదన్న టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమాను దసరా పండుగకు ముందు కాకుండా దసరా రోజునే అంటే అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి చిత్ర బృందం వచ్చిందని అంటున్నారు. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని అంటున్నారు. చూడాలి మరీ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” రిలీజ్ డేట్ మార్చుకుంటాడా లేదా అన్నది.

సంబంధిత సమాచారం :