2021 ట్విట్టర్ లో ఎక్కువగా ట్వీట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!

Published on Dec 9, 2021 1:30 pm IST

సౌత్ ఇండియా మూవీస్ దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. సోషల్ మీడియా లో సైతం సినిమా ప్రభావం గట్టిగానే ఉంది. ట్విట్టర్ వేదిక గా సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2021 సంవత్సరం లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన చిత్రాల గురించి మనం తెలుసుకుందాం.

2021 లో ట్విట్టర్ లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన ఆ 5 చిత్రాలు మాస్టర్, వలిమై, బీస్ట్, జై భీమ్, వకీల్ సాబ్. వకీల్ సాబ్ తెలుగు చిత్రం కాగా, మిగతా సినిమాలు తమిళ భాష కి చెందినవి. విజయ్ హీరోగా నటించిన మాస్టర్ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అజిత్ హీరోగా నటిస్తున్న వలిమై చిత్రం మరియు విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. సూర్య హీరోగా నటించిన మరొక చిత్రం జై భీమ్. ఈ చిత్రాలు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఈ చిత్రాల్లో విజయ్ సినిమాలు రెండు ఉండటం విశేషం.

సంబంధిత సమాచారం :