వలిమై నుండి మదర్ సాంగ్ విడుదల!

వలిమై నుండి మదర్ సాంగ్ విడుదల!

Published on Dec 5, 2021 8:33 PM IST


అజిత్ కుమార్ హీరోగా, హుమా ఖురేషీ, కార్తికేయ గుమ్మకొండ, బాని, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం వలిమై. ఈ చిత్రానికి హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి మరొక సాంగ్ విడుదల అయ్యింది.

మదర్ సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. లిరికల్ వీడియో గా విడుదల అయిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. యూ ట్యూబ్ ను సైతం ఈ పాట షేక్ చేస్తోంది. విడుదల అయిన కొద్ది సేపటికే భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు