టీవీ సీరియల్స్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా సిటీల్లో కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రజారాధన పొందిన సీరియల్స్ వేల ఎపిసోడ్లుగా నడిచాయి. సీరియల్ కొంచెం బాగున్నా.. మహిళలు నెత్తిన పెట్టుకుంటారు. దీనికి ఉదాహరణగా ఇటీవలే మొదలయ్యిన ఓ కొత్త సీరియల్ కేవలం వారంలోనే రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ సంపాదించుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మా టీవీ ఛానెల్లో ఇటీవలే “మౌన రాగం”అనే సీరియల్ మొదలయ్యింది. ఆ సీరియల్ కథ విషయానికి వస్తే.. ‘తనకి కూతురు వద్దు, కొడుకు మాత్రమే కావాలని కోరుకునే తండ్రికి ఒక కూతురు పుడుతుంది. అందులోనూ ఆమె మాటలు రాని అమ్మాయిగా పుడుతుంది, దీంతో ఆమెకు తన తండ్రి నుంచి ఎదురైన చేదు సంఘటనలు, ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆమె జీవితంలో ఎలా నిలదొక్కుకుంటుంది. అనే పాయింట్ బేస్ మీద రాసుకున్న కథ కథనాలతో ఈ సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతుంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రతీ రోజు రాత్రి 8:30 నిమిసాలకు ఈ సీరియల్ ప్రచారం అవుతుంది. అయితే ఆ సమయంలో వచ్చే ఏ సీరియల్ కి రాని విధంగా ఈ సీరియల్ కు మొదటి వారంలోనే రికార్డ్ స్థాయిలో 8.6 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. బుల్లితెర పై ‘మౌనరాగం’ ఇంకెన్నీ సంచనాలను సృష్టిస్తుందో చూడాలి.
