చాలా తక్కువ సమయంలో సినిమా పూర్తవ్వడం విశేషం!

20th, January 2018 - 10:46:09 PM

తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై తెరకేక్కబోతున్న సినిమా ఛిలసౌ. సుశాంత్ హీరోగా ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. రుహాని శర్మ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతుంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తి అయ్యింది. రాహుల్ రవీంద్రన్ పక్కా ప్లానింగ్ తో తక్కువ టైం లో సినిమా పూర్తి చెయ్యడం విశేషం.

అనుభవం లేకుండా దర్శకత్వం మొదటిసారి చేసిన ఇంత షార్ట్ పిరియడ్ లో సినిమా ఫినిష్ చెయ్యడం హర్చించదగ్గ విషయం. ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. త్వరలో ఈ సినిమా ఆడియో ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.