ఈ వారాంతంలో వరుస సినిమాల సందడి!

19th, December 2016 - 12:16:56 PM

vangaveeti-pitta-sapta
ఈ వారాంతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ సినిమాలతో నిండిపోనున్నాయి. గత నెల రోజుల నుండి కరెన్సీ బ్యాన్ వలన వెనక్కు తగ్గిన అన్ని సినిమాలు ధైర్యం చేసి విడుదలైపోతున్నాయి. వీటిలో ముఖ్యమైన సినిమా రా గోపాల్ వర్మ ‘వంగవీటి’ చిత్రం. విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే బోలెడన్ని కాంట్రవర్సీలతో కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టాడు వర్మ. దీంతో వాస్తవ కథని వర్మ తెరపై ఎలా చూపాడో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీని తరువాత మంచి క్రేజ్ ఉన్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న సప్తగిరి హీరోగా అరుణ్ పవార్ రూపిందించిన ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవడంతో హాట్ టాపిక్ మారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఎన్నో రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న విశాల్, తమన్నాల తమిళ డబ్బింగ్ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’ కూడా శుక్రవారమే బరిలోకి దిగనుంది. ఆ తరువాత శనివారం చిన్న చిత్రంగా వచ్చి సురేష్ బాబు సమర్పణతో, ట్రైలర్లతో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న నూతన దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘పిట్టగోడ’ రిలీజ్ కానుంది. ఇలా ఈ నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానుండటంతో థియేటర్లన్నీ కళకళలాడనున్నాయి.