ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!

Published on Oct 19, 2021 2:34 am IST


రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్ని థియేటర్లుకు క్యూ కట్టాయి. అయితే ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటే, మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి దసరాకు ముందు, పండగ సందర్భంగా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరీ ఆ సిమాలపై ఓ లుక్క్కేదాం.

థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు:

* ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది

* శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా ఎన్వీఆర్ దర్శకత్వంలో య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అస‌లేం జ‌రిగింది’. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది.

* అయితే సన్నీ నవీన్‌, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో జయకిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మధుర వైన్స్‌’. ఈ సినిమా అక్టోబరు 22న థియేటర్లలో విడుదల కానుంది.

* సునీల్‌, సుహాస్‌ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం

ఓటీటీలో విడుదయ్య సినిమాలు:

* నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి జంటగా క్లాస్‌ డైరెక్టర్‌ శేఖ‌ర్ క‌మ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

* రత్నన్‌ ప్రపంచం – అక్టోబరు 22
* రత్నన్‌ ప్రపంచం – అక్టోబరు 22
* సక్సెషన్‌ – అక్టోబరు 18
* ఓవ్‌ మనపెన్నే – అక్టోబరు 22
* లాకే అండ్ కీ – అక్టోబర్ 23

సంబంధిత సమాచారం :

More