రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి !

Published on Oct 3, 2021 9:07 pm IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలో ప్రస్తుత రాజకీయాల గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకుల గురించి, అలాగే ఓటర్ల బలహీనతలు, తప్పుల గురించి కూడా ఈ చిత్రంలో దర్శకుడు దేవకట్టా బాగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్ట్ ఛీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత, ఏ.ఎమ్.బీ సినిమాస్‌ లో ఈ రిపబ్లిక్ మూవీని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం.. ‘తమకు సినిమా బాగా నచ్చిందని, మొత్తం బృందాన్ని ప్రశంసించారు. ️ ️ దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏవరేజ్ టాక్ తో ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం :